‘హాయ్ నాన్న’ నుంచి ‘గాజు బొమ్మ’ సాంగ్.. పాట చూసి ఎమోషనల్ అయిన మహేష్ బాబు

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’.

Update: 2023-10-07 14:18 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. తండ్రి, కూతురు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా త్వరలోనే ప్రేక్షకుల ముంకు రానుంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ ఎంతగానో ఆకట్టుకోగా.. తాజాగా ‘గాజు బొమ్మ’ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రీకూతుళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు.. ‘ఒక తండ్రి నుంచి అతని కుమార్తె వరకు.. ప్రతి తండ్రి మదిలో ప్రతిధ్వనించే పాట ఇది. ‘హాయ్ నాన్న’ మూవీ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్’ అంటూ ట్విట్టర్‌లో సాంగ్ షేర్ చేశారు.

Tags:    

Similar News