లావణ్య ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన అడ్వకేట్..!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్-లావణ్యల ప్రేమ, పెళ్లి వ్యవహారం టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్-లావణ్యల ప్రేమ, పెళ్లి వ్యవహారం టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్‌తరుణ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని, అబార్షన్ కూడా చేయించాడని ఆరోపిస్తూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నార్సింగ్ పోలీసులు రాజ్‌తరుణ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, కేసు వెనక్కి తీసుకోవాలంటూ తనపై ఒత్తిడి చేస్తున్నారంటూ లావణ్య శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం. తన లాయర్‌తో పాటు పోలీసులకు సమాచారం అందించి లావణ్య సూసైడ్ అటెంప్ట్ చేశారు. దీంతో హుటాహుటిన వెళ్లిన పోలీసులు లావణ్యను సేవ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో లావణ్య తరుఫు లాయర్ దిలీప్ సుంకర శనివారం మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. రాజ్‌తరుణ్‌తో ప్రేమ, పెళ్లి ఇష్యూలో న్యాయం చేయాలని లావణ్య తనను ఆశ్రయించిదని తెలిపారు. హీరో రాజ్‌తరుణ్, లావణ్య పెళ్లి మాట వాస్తవమేనని దిలీప్ క్లారిటీ ఇచ్చారు. రాజ్‌తరుణ్‌పై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని లావణ్యను బెదిరిస్తు్న్నారని, రాజేష్ అనే ఓ లాయర్ లావణ్యకు ఫోన్ చేసి కేసు నిలబడదని బెదిరించాడని.. ఈ డిప్రెషన్లో లావణ్య ఆత్మహత్యకు చేసుకోవాలనుకుందని అసలు కారణం బయటపెట్టారు.
లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని తప్పుడు ప్రచారం చేశారని, ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. తప్పుడు కేసులతో లావణ్యను ఇరికించారని.. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని తేల్చి చెప్పారు. లావణ్యపై నమోదైన 3 కేసుల్లో క్వాష్ పిటిషన్ వేస్తామని క్లారిటీ ఇచ్చారు. హీరో రాజ్‌తరుణ్‌పై 493 సెక్షన్ కింద కేసు నమోదైందని.. కానీ ఇప్పటి వరకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. సోమవారం వరకు రాజ్ తరుణ్ కు నోటీసులు ఇవ్వకుంటే కోర్టుకెళ్తామని స్పష్టం చేశారు. లావణ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తోన్న రాజ్‌తరుణ్ దమ్ముంటే మీడియా ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
Read More..