Kriti Sanon: గర్వంగా ఉంది ఇప్పటికీ తనే నా స్ఫూర్తి.. కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి సనన్ హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

Update: 2024-08-31 05:58 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి సనన్ హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అలాగే తెలుగులోనూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ మూవీలో నటించి మెప్పించింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో ఈ అమ్మడు ఫోకస్ మొత్తం బాలీవుడ్ వైపే పెట్టింది. ఇటీవల క్రూ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రజెంట్ ‘దో పత్తీ’ సినిమాలో నటిస్తుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతుండగా.. ఇందులో కాజోల్‌ కూడా కనిపించనుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ నేను కాజోల్ నటించిన దిల్‌వాలే మూవీ షూటింగ్ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి.

అప్పుడు నాకు అంతగా సినిమాలపై అవగాహన లేకపోవడంతో పాటు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. అయితే ఆ చిత్రంతో మేమిద్దరం అక్కాచెల్లెళ్లుగా నటించాము. అప్పటికే ఆమె ఒక స్టార్ హీరోయిన్. నా రెండో మూవీనే ఆమెతో నటించడం గర్వంగా అనిపించింది. తన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ తన ప్రయాణాన్ని నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం మరింత మెరుగ్గా ఉత్సాహంగా కనిపించడం నచ్చింది. మళ్లీ 9 ఏళ్ల తర్వాత కాజోల్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న వారంతా ఆమె లాగా స్టార్ అవ్వాలని అంటున్నారు.


Similar News