ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేయగలను: క్రిష్ సిద్దిపల్లి

స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు, 'క్షణం' సినిమా అసిస్టెంట్ డైరెక్టర్, అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కుర్రాడు క్రిష్ సిద్దిపల్లి.

Update: 2023-02-05 11:56 GMT

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు, 'క్షణం' సినిమా అసిస్టెంట్ డైరెక్టర్, అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కుర్రాడు క్రిష్ సిద్దిపల్లి. ఫిబ్రవరి 3న తన పుట్టినరోజు సందర్భంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సినిమా మీద ఫ్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చానని, మొదట అవకాశాలు లేక 8 ఏళ్లు డిఫరెంట్ సెగ్మెంట్లో పని చేసినట్లు తెలిపాడు.

'అడవి శేషు 'క్షణం' నా లైఫ్‌కు టర్నింగ్ పాయింట్. 2021లో 'నేను లేని నా ప్రేమకథ' ప్రాజెక్ట్ నాకు మంచి పేరు తీసుకువచ్చింది. అయితే కోవిడ్ కారణంగా కొంత గ్యాప్ వచ్చినప్పటికీ మళ్లీ ప్రస్తుతం 'సుఖీభవ', 'ఎంగేజ్మెంట్' వంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నా. ఏలాంటి పాత్ర ఇచ్చినా అవలీలగా చేయగలను. ఈ చిత్రాల గురించి నా పుట్టినరోజున మీడియాతో షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్టులు డిస్కషన్‌లో ఉన్నాయి. ప్రేక్షకులు, మీడియా ఆశీర్వాదంతో గొప్ప నేమ్ అండ్ ఫేమ్ పొందాలని కోరుకుంటున్నా' అన్నాడు.

READ MORE

నాకెప్పుడూ అలాంటి క్యారెక్టర్లే ఇచ్చేవాడు: డైరెక్టర్‌పై టబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

Tags:    

Similar News