అంబానీ ఇంట కియారా అందాలు విందు.. స్టైలిష్‌గా ఆకట్టుకుంటున్న బ్యూటీ

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి జూలై 12 న జరగనున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-07 13:40 GMT

దిశ, సినిమా: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి జూలై 12 న జరగనున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ అంబానీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖులు, సినీ తారలు పాల్గొంటూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ పార్టీ అట్టహాసంగా జరిగింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సొగసైన ముత్యాలతో అలంకరించబడిన ప్రీ-డ్రేప్డ్ పాస్టెల్ పింక్ చీరలో కియారా అందరి దృష్టిని ఆకర్షించింది. మత్స్యకన్య సేప్ లాంటి ఆ చీరలో ఈ అమ్మడు అందాలు మరింత అందంగా కనిపించడంతో కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ కియారా తన ఇన్‌స్టా వేదికగా పంచుకోగా.. ప్రజెంట్ అవి వైరల్ అవుతున్నాయి.

కాగా.. కియారా టాలీవుడ్‌లో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తుంది. అలాగే.. ‘డాన్ 3’ లో రణవీర్ సింగ్ సరసన నటించనుంది. దీనిపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేసింది చిత్ర బృందం. ఇక వీటితో పాటుగా.. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘వార్ 2’ కూడా ఈమె భాగమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Similar News