Youtuber Harsha Sai:యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్..!?

పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ప్రముఖ యూట్యూబర్ పై ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-25 04:57 GMT

దిశ,వెబ్‌డెస్క్:పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ప్రముఖ యూట్యూబర్ పై ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూట్యూబర్ హర్ష సాయి (Youtuber Harsha Sai ) కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ‘‘ మెగా’’ సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి తెగింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి బాధితురాలు ప్రొడ్యూసర్‌గా వ్యవరించగా కాపీ రైట్స్(Copyrights) విషయం పై ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలి వీడియోలు హర్ష సాయి సీక్రెట్‌గా రికార్డు(Secret record) చేసినట్లు తెలిసింది. సినిమా కాపీ రైట్స్(Movie Copyrights) ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతానని హర్ష సాయి బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు సమాచారం.


Similar News