Samantha: అతన్ని మిస్ అవుతున్నానంటూ సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఎవరినో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటుంది. మయోసైటీస్ వ్యాధి రావడంతో ఆమె చికిత్స తీసుకుంటూ పలు యాడ్స్ చేస్తోంది.

Update: 2024-09-25 08:22 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటుంది. మయోసైటీస్ వ్యాధి రావడంతో ఆమె చికిత్స తీసుకుంటూ పలు యాడ్స్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పిక్స్‌ షేర్ చేస్తూ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. అయితే సమంత చివరిగా నటించిన  వెబ్‌సిరీస్ ‘సిటడెల్-హనీ బన్నీ’. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించగా.. రాజ్ డీకే దర్శకత్వం వహించాడు.

అయితే ఈ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రాలేదు. దీని కోసం సామ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ నవంబర్‌లో ‘సిటడెల్’ డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. తాజాగా, దీని ప్రీమియర్‌ను లండన్‌లో ప్రదర్శించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సమంత ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ‘‘మిస్సింగ్ మై మ్యాన్ వరుణ్ ధావన్’’ అనే క్యాప్షన్ జత చేసింది.

 


Similar News