‘మార్కో’ మూవీ నుంచి స్టన్నింగ్ లుక్ రిలీజ్.. హీరో ఎవరంటే?

మలయాళ హీరో ఉన్ని ముకుందన్ భాగమతి, ఖిలాడి, యశోద, మాలికాపురం వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు.

Update: 2024-09-25 07:48 GMT

దిశ, సినిమా: మలయాళ హీరో ఉన్ని ముకుందన్ భాగమతి, ఖిలాడి, యశోద, మాలికాపురం వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రజెంట్ ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మార్కో’. ఈ సినిమాకు ది గ్రేట్ ఫాదర్ ఫేం హనీఫ్ అదేని దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే యాక్షన్ జానర్‌లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో క్యుబ్స్ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రేమమ్ హీరో నివిన్ పాలీ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా, మార్కో మూవీ నుంచి స్టన్నింగ్ లుక్ విడుదలైంది. రక్తపు మరకలతో సిరీయస్ లుక్‌లో ఉన్న ఆయన కత్తిని పట్టుకుని టెర్రిఫిక్‌గా కనిపించాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.


Similar News