Kangana Ranaut: నటి కంగనాకు భారీ ఊరట.. ‘ఎమర్జెన్సీ’ విడుదలకు గ్రీన్ సిగ్నల్!

ఎంపీ కంగనా రనౌత్ (MP Kangana Ranaut) నటించి దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) మూవీ విడుదలకు తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) (CBFC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Update: 2024-09-26 07:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎంపీ కంగనా రనౌత్ (MP Kangana Ranaut) నటించి దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) మూవీ విడుదలకు తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) (CBFC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమాలోని కొన్ని సీన్లపై తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తూ ఇటీవలే కొందరు బాంబే హైకోర్టు (Bombay High Court)లో పిటిషన్‌ వేయగా.. ఆ పిల్‌పై విచారణ చేపట్టిన కోర్టు కొన్ని సున్నితమైన సన్నివేశాలను కట్ చేసి రిలీజ్ చేయవచ్చని పేర్కొంది. కానీ, సెప్టెంబర్ 30 వరకు ఆ విషయంలో కోర్టు ఓ నిర్ణయం తీసుకుంటుందని అప్పటి వరకు వెయిట్ చేయాలని నిర్మాతలకు సూచించింది. ముందుగా నిర్మాతలు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. అయితే, సెన్సార్ బోర్డ్ (Sensor Board) నుంచి సర్టిఫికేట్ రాకపోవడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. సినిమా విడుదలపై బాంబే హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ‘ఎమర్జెన్సీ’ని చట్టవిరుద్ధంగా అడ్డుకుంటోందని జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (Zee Entertainment Enterprises Ltd) ఆరోపించింది. సీబీఎఫ్‌సీ తరఫు న్యాయవాది అభినవ్ చంద్రచూడ్, న్యాయమూర్తులు బీపీ కొలబావాలా, ఫిర్దౌస్ పూనివాలా ధర్మాసనానికి వివరిస్తూ.. సీబీఎఫ్‌సీ (CBFC) రివైజింగ్ కమిటీ కూడా సినిమాలో కొన్ని కోతలు పెట్టాలని సూచించిందని పేర్కొన్నారు. అలా అయితేనే సినిమాను విడుదల చేయవచ్చని సీబీఎఫ్‌సీ గురువారం బాంబే హైకోర్టు (Bombay High Court)కు తెలియజేసింది. మరోవైపు జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ తరఫు న్యాయవాది శరణ్ జగ్తియానీ, విడుదలకు ముందు చిత్రంలో మొత్తం 11 సవరణలు చేసిన పత్రాన్ని కోర్టుకు చూపించారు. దీంతో కేసు విచారణను కోర్టు సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది. 


Similar News