సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న కాజల్.. నన్ను క్షమించండి అంటూ నెట్టింట పోస్ట్ వైరల్

నటి కాజల్ పసుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2023-12-26 14:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: నటి కాజల్ పసుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రజలకు అంతగా తెలియకపోయిన.. తమిళంలో మాత్రం సుపరిచితమే. కో, మౌన గురు, కథమ్ కథమ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తెలుగులో అల్లు శిరీష్ డెబ్యూ సినిమా ‘గౌరవం’ లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. తర్వాత 2008లో ఫేమస్ కొరియోగ్రాఫర్ అయిన శాండీ మాస్టర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కొంత కాలం సాఫీగానే సాగిన వీరి వివాహ జీవతంలో కొన్ని అనివార్య సంఘటనలు చోటుచేసుకోగా.. 2012లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

విడాకుల అనంతరం శాండీ మరో అమ్మాయిని వివాహం చేసుకోగా.. కాజల్ మాత్రం రెండో పెళ్లి చేసుకోలేదు. కానీ, తాజాగా కాజల్ పెట్టిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘ఫైనల్‌గా రెండో పెళ్లి చేసుకున్నా. నన్ను క్షమించండి ఫ్రెండ్స్. అందరూ క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నా’ అంటూ పెళ్లి బట్టల్లో ఉన్న ఫొటో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది. కానీ, భర్తను మాత్రం రివీల్ చేయలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాజల్ నిజంగా రెండో పెళ్లి చేసుకుందా..? లేక ఏదైనా మూవీ స్టంటా..? అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.


Similar News