కైకాల మృతి: సంతాపం తెలిపిన Modi
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ''ప్రసిద్ధ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ గారి మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో అద్భుతమైన నటనా చాతుర్యంతో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓంశాంతి' అని ప్రధాని మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. కాగా కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని తెలిపారు.