'డబుల్ ఇస్మార్ట్' విషయంలో ఛార్మిపై జానీ మాస్టర్ ఊహించని కామెంట్స్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం కోసం రామ్ పోతినేని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Update: 2024-07-21 13:40 GMT

దిశ, సినిమా: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం కోసం రామ్ పోతినేని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. దర్శక, నిర్మాతలతో పాటు మూవీ టీమ్ మొత్తానికి డబుల్ ఇస్మార్ట్ పక్కా హిట్ కొట్టనుందనే ధీమాతో ఉన్నారు. హిట్టా ఫట్టా అనేది మరో ఇరవై ఐదు రోజుల్లో తెలిసిపోతుంది. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ వాడిన విషయం తెలిసిందే. ‘ఏం చేద్దాం అంటావ్’ అనే కేసీఆర్ మాటలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద వివాదానికే దారి తీశాయి.

దర్శక, నిర్మాతలపై బీఆర్ఎస్ నేతలు ఓ రేంజ్ లో మండిపడ్డారు. అయితే ఓ వైపు సోషల్ మీడియాలో ఈ లొల్లి నడుస్తుండగా.. ఈ చిత్ర నిర్మాణం విషయంలో మరో వివాదం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాటల చిత్రీకరణలో పలు రూల్స్ అండ్ రెగ్యులెషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా తెలుగు డాన్సర్లనే తీసుకోవాలట. కానీ ఈ మూవీలో ఎక్కువమందిని ముంబయి డాన్సర్లను తీసుకున్నట్లు నెట్టింట ఆరోపణలు వినిపించాయి. తాజాగా దీనిపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. ‘నిజానికి ఇందులోని ఓ పాటకు దాదాపు 200 మంది డాన్సర్లు కావాలి. అప్పుడు షూటింగ్ ముంబయిలో జరుగుతుంది.

ఇంతమంది డాన్సర్లు కావాలని ఛార్మికి చెప్పాను. తను వెంటనే నో చెప్పింది. అంతమంది అంటే కష్టం.. 110 మంది అంటే తీసుకోండని చెప్పింది. నేను అప్పటికీ ఆమెకు చెప్పాను. కానీ నేను ఇప్పటికే నష్టాల్లో ఉన్నానని, అంత మంది డాన్సర్లను హైదరాబాదు నుంచి రప్పించడం కష్టమన్నారు. అంత ఖర్చు నేను భరించలేనని అన్నారు. ఇక హైదరాబాదులో షూటింగ్ చేసినప్పుడు.. తెలుగు డాన్సర్లనే ఎక్కువగా తీసుకున్నాం. ఖర్చు కూడా నేనే భరించానని’ జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు.


Similar News