Janhvi Kapoor: కాంజీవరం చీరలో ఆకట్టుకుంటోన్న బాలీవుడ్ బ్యూటీ .. ధరెంతో తెలిస్తే షాక్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తుంది. ఆల్రెడీ ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే జాన్వీ నటించిన ఈ సినిమా నుంచి అదిరిపోయే రొమాంటిక్ సాంగ్స్ విడుదలవ్వగా.. మంచి రెస్పాన్స్ లభించింది. మొన్న విడుదలైన దేవర పార్ట్-1 ట్రైలర్ అయితే నెటిజన్లను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ మాస్ లుక్, భారీ డైలాగ్స్, ఫైటింగ్స్, హీరోయిన్, హీరో మధ్య జరిగే లవ్ డ్రామా అన్ని సూపర్‌గా ఉన్నాయి. ఒక్క ట్రైలర్‌తో జనాల్లో దేవరపై భారీ హైప్ పెరిగింది.
తెలుగులో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకు ఇదే మొదటి సినిమా. దీంతో దేవర బ్లాక్ బస్టర్ హిట్ కావాలని జాన్వీ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. మరీ దేవర హిట్టా? ఫట్టా? అని తెలియాలంటే ఈ నెల (సెప్టెంబరు)27 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇకపోతే జాన్వీ లేటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట ఆకట్టుకుంటోంది. దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జాన్వీ కట్టుకున్న బంగారు కాంజీవం చీర చూడానికి ఎంతో చక్కగా, అత్యంత ఖరీదు గల చీరని తెలుస్తోంది. దీంతో కొంతమంది శారీ లవర్స్ పండుగ సీజన్‌కు పర్ఫెక్ట్ చాయిస్ ఇదేనంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. కాగా ఈ చీర ధరెంతని ప్రస్తుతం ఫ్యాన్స్ గూగుల్ లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. జాన్వీ కట్టుకున్న చీరకు అక్షరాలా 1 లక్ష 25 వేలు. ఈ ధర విన్న జనాలు నోరెళ్లబెడుతున్నారు.
ఈ చీరను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారట. బంగారు రంగు చీరపై ఎంబ్రాయిడరీ వర్క్, సీక్విన్ వర్క్ హైలైట్‌గా నిలిచాయి. దీనికి తోడు బాలీవుడ్ బ్యూటీ మేకప్ ఆమె దుస్తులకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వడంతో మంచి లుక్ వచ్చింది. బంగారు షైనింగ్ ఐ షాడో, బ్లాక్ ఐలైనర్, కాజల్, మస్కారాతో జాన్వీ అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం జాన్వీ గోల్డ్ కలర్ శారీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.