నా భార్య ఇప్పటికీ ఏడుస్తోంది.. వారి కాళ్ల మీద పడి అలా వేడుకున్నానంటూ కన్నీరు పెట్టుకున్న ముక్కు అవినాష్!

జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన కమెడీ టైమింగ్‌తో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లిన తర్వాత ఈయన మరింత పాపులారిటీ సంపాదించుకున్నారనే

Update: 2024-05-13 07:50 GMT

దిశ, సినిమా : జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన కమెడీ టైమింగ్‌తో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లిన తర్వాత ఈయన మరింత పాపులారిటీ సంపాదించుకున్నారనే చెప్పాలి. అవినాష్ బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చిన కొన్నిరోజులకు అందరికీ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తాము తల్లిదండ్రులం కాబోతున్నాం.. అంటూ తన భార్య బేబీ బంప్ ఫోటోస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి చాలా సంతోషపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు లేకుండా పోయింది. డెలవరీకి ఒక్క రోజు ముందు గర్భంలోనే శిశువు మరణించింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవినాష్ ఈ విషయం గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. నేను నా భార్య, పుట్టబోయే బిడ్డ కోసం చాలా కలలు కన్నాం.. కానీ నా జీవితంలో ఊహించని పరిణామం ఎదురయ్యింది. నేను షూటింగ్‌లో ఉన్న సమయంలో నాకు కాల్ వచ్చి. ఆసుపత్రికి వెళ్లగా.. బిడ్డ ఉమ్మనీరు తాగి మరణించిందని చెప్పారు. నేను డాక్టర్ కాళ్లపై పడి ఎలాగైనా నా బిడ్డను బతికించండి అని చెప్పాను. కాన హార్ట్ బీట్ లేదు నేను ఏం చేయలేను అని ఆమె చెప్పింది. బిడ్డను బయటకు తీశాక నేను చూశాను .. బాబు అచ్చం నా పోలికలతోనే ఉన్నాడు. ఈ సంఘటన నన్న చాలా బాధ పెట్టింది. దీని నుంచి నేను బయటకు రాలేకపోయాను, కానీ స్నేహితులు, అభిమానుల సపోర్ట్‌తో బయటప పడగలిగాను, నా భార్య ఇప్పటికీ రాత్రిళ్లు ఏడుస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే కొంత మంది మాపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ నేను నా భార్య అయితే జాగ్రత్తగానే ఉన్నాం అని ముక్కు అవినాష్ తెలిపాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Similar News