SP బాలసుబ్రహ్మణ్యం స్టార్ సింగర్‌ను చేసింది ఆ కమెడియన్‌నా.. అస్సలు ఊహించలేదుగా!

దివంగత గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పాటలను ఇష్టపడే వారు కోట్లలలో ఉంటారు. ఆయన చనిపోయినా, ఆయన పాడిన పాటలు మాత్రం ఇప్పటికీ

Update: 2024-07-14 17:52 GMT

దిశ, సినిమా : దివంగత గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పాటలను ఇష్టపడే వారు కోట్లలలో ఉంటారు. ఆయన చనిపోయినా, ఆయన పాడిన పాటలు మాత్రం ఇప్పటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయాయి. అంత గొప్ప వ్యక్తి కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? పాటల రారాజు, తెలుగు కీర్తి కిరీటం ఎస్పీనీ చిత్ర పరిశ్రమలో నిలబెట్టింది మాత్రం ఓ కమెడియన్ అంట ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా?

కమెడియన్ పద్మనాభం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సొంత బ్యానర్ పెట్టుకొని ఎంతో మందికి మంచి లైఫ్ ఇచ్చారు. అందులో బాలసుబ్రహ్మణ్యం ఒకరు. అయితే ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు బాలు మీద పూర్తి నమ్మకం పెంచుకున్న పద్మనాభం, మొదటి పాటకే బాలుకు రూ.300 రూపాయలు ఇచ్చాడంట. తర్వాత ఆయన పాటలకు ఫిదా అయిన చాలా మంది మంచి మంచి అవకాశాలు ఇవ్వడంతో స్టార్ సింగర్‌గా మారిపోయాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే,ఆయన అందరికీ చెప్పాడంట. అది బాలుకు ఉపయోగపడిందని, బాలసుబ్రహ్మణ్యం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వారంటూ ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Similar News