Rakul: ‘వేయించిన ఫుడ్ ఆర్డర్ చేశాడని లవ్ బ్రేకప్ చెప్పేశా’.. రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-09-13 03:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. గతంలో ఓ పర్సన్‌తో రిలేషన్‌లో ఉన్నప్పుడు చిన్న రీజన్‌తో అతడికి బ్రేకప్ చెప్పానని తెలిపింది. ఫుడ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని, ఆహారాన్ని గౌరవిస్తానని పేర్కొంది. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఆహారంలో మార్పులు చేసి తగ్గించుతానని వెల్లడించింది. హెల్తీగా ఉండాలని ఒక సంవత్సరం పొడవునా కేవలం శాకాహార భోజనమే తిన్నానని చెప్పింది. అలాంటిది అతడు ఫుడ్ గురించి తక్కువ చేసి మాట్లాడడం నాకు నచ్చలేదని తెలిపింది. ఒక రోజు ఇద్దరం కలిసి హోటల్ కు వెళ్లామని, అతడు రకుల్ ఆర్డర్ చేసిన ఫుడ్ పక్కన పెట్టి.. మళ్లీ వేయించిన ఫుడ్ ఆర్డర్ చేశాడని తెలిపింది. కానీ ఆ ఫుడ్ రకుల్‌ కు నచ్చలేదని, భోజనాన్ని, జీవనశైలిని పంచుకోలేని పర్సన్ నాకు అవసరం లేదని అనిపించిందని రకుల్ చెప్పుకొచ్చింది. దీంతో బ్రేకప్ చెప్పానని, నాకంటూ సొంత ఆహారపు అలవాట్లు ఉన్నాయని హీరోయిన్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.  


Similar News