ఆ ఇద్దరు హీరోయిన్స్ చేసిన ఆ ఒక్క పని చేసుంటే.. సమంత లైఫ్ బాగుపడిపోయుండేది కదా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాలు స్టార్ సెలబ్రిటీస్‌కి ఏ విధంగా సజెషన్స్ ఇస్తున్నారో మనం చూస్తున్నాం.

Update: 2024-06-05 07:01 GMT

దిశ, సినిమా: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాలు స్టార్ సెలబ్రిటీస్‌కి ఏ విధంగా సజెషన్స్ ఇస్తున్నారో మనం చూస్తున్నాం. అందులో మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంతను చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఆమెకు అవసరమున్న లేకపోయినా ఘాటు ఘాటుగా ట్రోల్ చేస్తున్నారనే విషయం మనకు తెలిసిందే. ఆ క్రమంలోనే ఈ బ్యూటీ మళ్లీ ఒక ఇష్యూ కారణంగా ట్రోలింగ్ కి గురవుతుంది. కాజల్ అగర్వాల్ - అలియా భట్ చేసిన ఆ ఒక్క పని ఈ బ్యూటీ చేసుంటే లైఫ్ ఎప్పుడో బాగుపడిపోయి ఉండేది అని చెప్పుకొస్తున్నారు. అసలు వీరు చేసిన ఆ ఒక్క పని ఏంటో ఇక్కడ చూద్దాం..

కాజల్ అగర్వాల్ - అలియా భట్ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున్నారు. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళు వెంటనే ఒక బాబుకి.. పాపకు జన్మనిచ్చిన తర్వాత వీళ్ళ వైవాహిక జీవితం ఎంత సాఫీగా ముందుకు వెళుతుంది అనేది అందరికీ తెలిసిందే. కానీ సమంత అలా చేయలేదు. పెళ్లి తర్వాత పిల్లల్ని కనకుండా చాలా గ్యాప్ తీసుకుంది. ఆ గ్యాప్ లోనే నాగచైతన్య, సమంత మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు విడాకులు తీసుకున్నారు. అలా కాకుండా ఒకవేళ కాజల్ అగర్వాల్ - ఆలియా భట్ చేసిన విధంగానే సమంత కూడా ఒక బిడ్డను కని ఉంటే ఇప్పుడు ఆమె కూడా తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉండేది అని .. సమంత తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఇప్పుడు ఆమె కెరీర్ ఇంతలా మారిపోయేలా చేసింది అని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త ట్రెండ్ అవుతూ ట్రోలింగ్ కి గురవుతుంది.


Similar News