ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పని స్టార్ హీరో సతీమణి.. కారణం అదేనంటూ నెట్టింట తీవ్ర చర్చ

గత కొద్ది రోజుల నుంచి మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

Update: 2024-07-23 08:24 GMT

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు పలికాడంటూ నెట్టింట వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అల్లు అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్య నెట్టింట తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఇకపోతే రీసెంట్‌గా గ్లోబల్ స్టార్ సతీమణి ఉపాసన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో అభిమానులు, కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉపాసన థాంక్యూ అంటూ స్పందించింది కూడా. కానీ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకు బర్త్ డే విషెష్ చెప్పలేదట. లావణ్య త్రిపాఠి, నమ్రత శిరోద్కర్, తారక్ భార్య లక్ష్మి ప్రణతి.. ఇలా అందరూ విష్ చేయగా స్నేహా చేయకపోవడంతో నిజంగానే వీరిద్దరి ఫ్యామిలీల మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ జనాలు వారికి వారే ఫిక్స్ అయిపోతున్నారు. అభిమానుల మధ్య కామెంట్ల యుద్ధం జరుగుతుంది. మరీ ఈ రెండు ఫ్యామిలీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.


Similar News