బాల్యంలోనే లైంగిక వేధింపులకు గురయ్యాను.. స్టార్ కిడ్ షాకింగ్ కామెంట్స్
స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.
దిశ, సినిమా: స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. కానీ తన నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అంతే కాకుండా.. ఇటీవల విడుదలైన ‘హనుమాన్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ సొంతం చేసుకున్న వరలక్ష్మి.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే త్వరలో ‘శబరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని అనిల్ దర్శకత్వం వహిస్తుండగా.. మహేంద్రనాథ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ మూవీ మే 3వ తేదీన రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో.. ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం. ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి.. తన పర్సనల్ లైఫ్ గురించి, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
సినిమా గురించి చెప్తూ.. ‘‘శబరి’ సినిమా తల్లీ కూతుళ్ల ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక సింగిల్ మదర్ తన కూతరుకి ఎలాంటి లోటు తెలియకుండా పెంచాలని అనుకుంటుంది. అలాంటి సమయంలో తన బిడ్డకి ఎవరైనా ఆపద తలపెట్టాలని ప్రయత్నిస్తే.. తల్లి ఎలా రియాక్ట్ అవుతుంది.. కూతురుని ఎలా కాపాడుకుంటోంది అనేది స్టోరీ. ప్రధానంగా ఓ మూవీ అంశాలు కథను మలుపు తిప్పుతాయి’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక పర్సనల్ లైఫ్ గురించి వరలక్ష్మి మాట్లాడుతూ.. ‘నేను బాల్యంలోనే లైంగిక వైధింపులకు గురయ్యాను. అదే నా జీవితంలో మర్చిపోలేని గాయం. అయితే.. ఈరోజుల్లో ప్రతీ ఒక్కరికి థెరపిస్ట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది మానసిక పరిస్థితుల గురించి పక్కన వాళ్లకి, రిలేటివ్స్‌కు, ఫ్రెండ్స్‌కు చెప్పుకోలేరు. ఎందుకంటే ఎవరూ ఎలా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావడం లేదు కాబట్టి థెరపిస్ట్ ఉంటే చాలా బెటర్. కుటుంబసభ్యులతో నీ సమస్యల గురించి మాట్లాడితే మనల్నే జడ్జ్ చేస్తారు. అదే థెరపిస్ట్‌తో మాట్లాడితే మనల్ని సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారు. అందుకే మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే.. థెరపిస్ట్ దగ్గరకు వెళ్లి నయం చేసుకోవడం ముఖ్యం’ అంటూ తెలిపింది వరలక్ష్మి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More..
రాశీఖన్నాతో అలా ఒక్కసారి చేశా నా వల్ల కాలేదు.. టాలీవుడ్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్