NTR: ఎన్టీఆర్ ని కలిసాను .. దేవుడు నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇదే అంటూ..   తమిళ్ యాంకర్ ఎమోషనల్ పోస్ట్

ఎన్టీఆర్ ని కలిసాను .. దేవుడు ఇచ్చిన నాకు బెస్ట్ గిఫ్ట్ ఇదే అంటూ

Update: 2024-09-18 07:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : శివ కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ దేవర. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 17 న చెన్నైలో జరిగిన దేవర ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ ప్రెస్ మీట్ కి అంజన రంగన్ యాంకరింగ్ చేసింది. టాలీవుడ్ సినిమాలన్నింటికీ సుమ ఎలా యాంకరింగ్ చేస్తుందో అలాగే ఆమె కూడా తమిళంలో అంతే. అయితే, దేవర ఈవెంట్ అయ్యాక ఆ యాంకర్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

అంజన, ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలు షేర్ చేసి.. " నేను ఇండస్ట్రీ కి వచ్చి ఈ రోజుకి 16 ఏళ్ళు అయింది. 17వ ఏడాదిలోకి ఒక డ్రీమ్ లాంటి ఈవెంట్ తో అడుగుపెడుతున్నాను. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ని స్క్రీన్ పై చూసి ఇష్ట పడ్డానని, డైరెక్ట్ గా ఎప్పుడు చూస్తానా అని చాలా వేచి చూసాను. మొత్తానికి దేవర మూవీ ప్రెస్ ఈవెంట్ ని హోస్ట్ చేశాను. నా జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజు.. దేవుడు నాకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చాడంటూ " ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.

ఈమె పెట్టిన పోస్ట్ వైరల్ గా అవ్వగా ఎన్టీఆర్ అభిమానులు అంజన పోస్ట్ కింద సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Tags:    

Similar News