గతంలో తెలియక తప్పు చేశానంటూ అసలు విషయం బయట పెడుతూ సమంత పోస్ట్.. చైతో విడాకుల గురించేనా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారు. కానీ విడాకులు కారణాలేంటో మాత్రం వెల్లడించలేదు.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారు. కానీ విడాకులు కారణాలేంటో మాత్రం వెల్లడించలేదు. దీంతో నిత్యం విడాకులకు సంబంధించిన వార్తలు వైరలు అవుతున్నాయి. అయినప్పటికీ వీరిద్దరు స్పందించకుండా ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. నాగచైతన్య వరుస సినిమాలు చేస్తూ హిట్స్ సాధించేందుకు కష్టపడుతున్నాడు. ఇక సామ్ మాత్రం దాదాపు రెండేళ్లుగా సినిమాలకు దూరం అయింది. మయోసైటీస్ వ్యాధి కారణంగా చికిత్స తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటోంది.
అలాగే మొంటల్ హెల్త్ బాగుండేలా యోగా, ధ్యానం చేస్తు అప్పుడప్పుడు వేకేషన్స్‌కు కూడా వెళ్లొస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. హెల్త్ పాడ్ కాస్ట్లో పలు విషయాలు చెబుతోంది. ఇక ఈ అమ్మడు నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఇటీవల సమంత నిర్మాతగా మారింది. అలాగే ఓ మూవీతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. కానీ దీనికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కాలేదు. దీంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టి పలు వీడియోలు షేర్ చేస్తుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ నెటిజన్ గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్‌ను ప్రమోట్ చేశారు. అందుకు ఏం సమాధానం చెబుతారు అని అడగ్గా.. దీనిపై సమంత స్పందించింది. ‘‘ అవును నేను గతంలో తప్పులు చేశాను. దాని గురించి ఏమీ తెలియనప్పుడు. కానీ నేను చాలా వాటిని అంగీకరించడం మానేశాను. నేను చెప్పేవాటినే నమ్ముతాను. లేదంటే దేవుడు ఆగ్రహిస్తాడు’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం తప్పే అని ఒప్పుకున్నట్లు పలు వార్తలు జోరందుకున్నాయి. కానీ సామ్ ఫ్యాన్స్ మాత్రం అవన్నీ కొట్టిపారేస్తున్నారు.