ఆ విషయంలో వరుణ్ తేజ్ మీద నాకు కోపం ఉంది.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్

మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ కాంబోలో రాబోతున్న ‘చిత్రం ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాను శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు.

Update: 2024-02-26 04:16 GMT

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ కాంబోలో రాబోతున్న ‘చిత్రం ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమాను శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. అయితే ఆపరేషన్ వాలెంటైన్ నుంచి ఇప్పటికే విడుదలై పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. మార్చి 1న ఈ చిత్రం థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా, ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఆదివారం నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవిని యాంకర్ సుమ పలు ప్రశ్నలు అడిగింది. చిరు లీక్స్ అంటే ఇష్టం కానీ వరుణ్ లవ్ గురించి ఎప్పుడు లీక్ కాలేదు.. ఆ లీక్ మీకు రాలేదా? అని అడిగింది. దానికి చిరు స్పందిస్తూ.. ‘‘వరుణ్ తేజ్ నాతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటాడు. వాళ్ల నాన్నకు చెప్పలేనివి కూడా నాతో చెబుతుంటాడు.

నేనే ఇన్‌స్పిరేషన్ అంటాడు. అన్నీ చెబుతాడు.. కానీ లవ్ విషయాన్ని మాత్రం నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఆ విషయంలో మాత్రం వరుణ్‌పై కోపంగా ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. దానికి వరుణ్.. గౌరవంతో కూడిన భయం వల్లనే చెప్పలేదు. కానీ లావణ్య గురించి మాత్రం చిరంజీవి గారికే చెప్పాను’’ అని తెలిపాడు. ప్రస్తుతం చిరంజీవి కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Similar News