urvashi rautela: ఆసుపత్రిలో చేరిన హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేల పోస్ట్ వైరల్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఊర్వశి రౌటేల ఐటమ్ సాంగ్స్‌లో ఆడి పాడి హీరయిన్ అంత పాపులారిటీ తెచ్చుకుంది.

Update: 2024-08-23 11:44 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఊర్వశి రౌటేల ఐటమ్ సాంగ్స్‌లో ఆడి పాడి హీరయిన్ అంత పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగులో చిరంజీవి వాల్తేరు వీరయ్య, ఏజెంట్ వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అమ్మడు తన క్రేజ్‌ను పెంచుకుంది. అలాగే స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ పై పలు పోస్టులు పెట్టి నెట్టింట రచ్చ చేసింది. ప్రస్తుతం ఊర్వశి బాలయ్య ‘NBK109’ సినిమాలో చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండి పలు పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఊర్వశి ఆసుపత్రిలో చేరిన వీడియో ఒకటి నెట్టింట షేర్ చేసి ట్రోలింగ్‌కు గురవుతుంది. తన చేతికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈ గాయాన్ని చూపిస్తూ అమ్మడు నా కోసం ప్రార్థించండి అనే క్యాప్షన్ జత చేయడంతో పాటు ఆక్సీజన్ మాస్క్‌ పెట్టుకుని ఉన్న వీడియోను పెట్టింది. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గాయపడిన మొదటి భారతీయ మహిళ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ఇంత చిన్న గాయానికి ఆక్సిజన్ కూడా తీసుకుంటారా? అని మరికొందరు అంటున్నారు. కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆమెకు ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. ప్రజెంట్ ఊర్వశి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Full View

(Video Link Credits to urvashirautela Instagram Channel)

Tags:    

Similar News