హార్స్ రైడ్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన Samantha
టాలీవుడ్ స్టార్ సమంత అనారోగ్యం బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ.. సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే..
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ సమంత అనారోగ్యం బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ.. సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యశోద సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన ఈ బ్యూటీ, తన నెక్ట్స్ మూవీ ‘శాకుంతలం’ ను కూడా రెడీ చేసింది. దీంతోపాటు సమంత ఓ వెబ్ ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులతో పంచుకుటుంది. తాజాగా, సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. హార్స్ రైడింగ్ చేస్తూ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘యూఆర్ బోత్.. బ్యూటీ అండ్ ది బీస్ట్’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. సమంత గుర్రం స్వారీ చేస్తూ కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.