Pranita Subhash: ఫ్యాన్స్ కోసం ఆ రంగు చీర కట్టిన పవర్ స్టార్ హీరోయిన్.. అట్రాక్టింగ్ పిక్స్ వైరల్

Update: 2024-09-13 08:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రణీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. ముఖ్యంగా గ్లామరస్ బ్యూటీగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ అమ్మడు జూనియర్ ఎన్టీఆర్ సరసన రభస చిత్రంలో , పవన్ స్టార్ పవన్ కల్యాణ్ తో అత్తారింటికి దారేటి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ బ్యూటీ నటించింది తక్కువ సినిమాల్లో అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం భారీగానే ఉంటారు. 

ఇక సినీ కెరీర్‌లో అప్పుడే అవకాశాలు అందుకుంటోన్న సమయంలో ప్రణీత సుభాష్ నితిన్ రాజును వివాహం చేసుకుంది. 2022 లో పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. రీసెంట్‌గా ఈ దంపతులిద్దరూ మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రణీత సినిమాలకు దూరమైనప్పటికీ ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. టెంపుల్స్, వెకేషన్స్, తన పాపకు సంబంధించిన ఫొటోలు, ఇంట్లో ఘనంగా సెలబ్రేట్ చేసుకొన్న ఫెస్టివల్ పిక్స్ తరచూ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూనే ఉంటుంది. తాజాగా ప్రణీత బ్లూ కలర్ శారీ కట్టుకుని ఫొటో షూట్ చేసింది. ఇద్దరి పిల్లలకు తల్లైనా చెక్కుచెదరని అందంతో.. అదే గ్లామర్‌తో కట్టిపడేస్తుంది. చిలిపి ఫోజులిచ్చిన ఫొటోలకు ప్రణీత.. ‘బ్లూ కలర్‌లో చూడాలనుకుంటున్నామని చాలా మంది అడిగారు. ఈ రంగు చీర మీ కోసం’ అంటూ ప్రణీత ఫొటోలకు ఈ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా సంతూర్ మమ్మీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.   

Full View


Similar News