star heros collections: రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసిన హీరోలు.. ఈ జాబితాలో వీళ్లు చేరనున్నారా?

ప్రస్తుతం స్టార్ సీనియర్ హీరోల మధ్య గట్టి పోట నడుస్తోంది.

Update: 2024-07-22 08:28 GMT

దిశ, సినిమా: ప్రస్తుతం స్టార్ సీనియర్ హీరోల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల పరంగానూ ఒకరిని మించి ఒకరు దూసుకుపోతున్నారు. దీనికి ముఖ్య కారకులు వెరీ టాలెంటెడైన మన తెలుగు డైరెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతున్నారనడంతో ఏ మాత్రం సందేహం లేదు. ఇండియా గర్వించదగ్గ డైరెక్టర్లలో ముందుగా టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి పేరు చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే..

ఒకప్పుడు ఎంతటి అగ్ర హీరోలైనప్పటికీ 100 కోట్లు వసూలు చేయడం చాలా కష్టం. కానీ ప్రజెంట్ ఐదు వందల కోట్ల కలెక్షన్లు ఈజీగా రాబడుతున్నారు. అయితే ఇప్పటివరకు 1000 కోట్లు వసూలు చేసిన చిత్రాలు, ఆ సత్తా చాటిన హీరోలెవరని నెట్టింట టాక్ నడుస్తోంది. ఆ అగ్ర హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..

* ప్రభాస్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898’ చిత్రానికి దాదాపు 1100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.దీంతో పాటు చరిత్ర సృష్టంచిన బాహుబలి పార్ట్ -2 కూడా మొదటిసారిగా వెయ్యి కోట్లు దాటింది. జక్కన్న దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏకంగా 180 కోట్లు రాబట్టడం విశేషం.

* అమీర్ ఖాన్: బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రానికి కూడా వరల్డ్ వైడ్ 2000 కోట్లు వసూలు చేసింది.

* షారుఖ్ ఖాన్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టినవి రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి జవాన్, మరోటి పఠాన్ మూవీ.

* హీరో యష్: కన్నడ స్టార్ హీరో యష్ రెండేళ్ల క్రితం కేజీఎఫ్ చిత్రంతో రికార్డు క్రియేట్ చేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏకంగా 1200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది.

ఈ అగ్ర హీరోల జాబితాలో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు చేరారు. మరీ వారు ఎవరో కాదు.. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. జక్కన్న దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి 1150 కోట్లు వసూలు చేసింది. నెక్ట్స్ విడుదలయ్యే గేమ్ ఛేంజర్, దేవర చిత్రాలు కూడా ఈ లిస్ట్‌లో చేరనున్నాయంటూ అభిమానులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఐకాన్ స్టార్ నటిస్తోన్న పుష్ప-2 చిత్రం కూడా ఈ జాబితాలో చేరనుందో చూడాలంటున్నారు.


Read more...

Kalki 2898AD: మరో ఘనత.. ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డును బద్దలు కొట్టిన ‘కల్కి 2898ఏడీ’ 




Similar News