రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించిన హీరో వెంకటేష్..
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తే గాయత్రి నేడు ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి నేడు ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక కూతురిని కోల్పోయి.. బాధలో ఉన్న నటుడిని పరామర్శించడానికి ఇప్పటికే నటులు సాయి కుమార్, శివాజీ రాజా, ఏడిద రాజాలతో పాటు తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వంటి రాజకీయ నాయకులు వచ్చారు. అలాగే పలువురు సెలబ్రిటీలు X వేదికగా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా విక్టరీ వెంకటేష్ HYD కూకట్‌పల్లిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే గాయత్రి పార్థీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.