కన్న కూతురితో కూడా రొమాంటిక్ సీన్స్ చేయగలడు.. స్టార్ హీరోపై మరో హీరో సంచలన కామెంట్స్

అప్పట్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. సినీ ఇండస్ట్రీలో అండ్ తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నటుడు సుమన్.

Update: 2024-07-22 15:53 GMT

దిశ, సినిమా: అప్పట్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. సినీ ఇండస్ట్రీలో అండ్ తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నటుడు సుమన్. మంచి యాక్టర్‌గా పేరు దక్కించుకున్న ఈ హీరో ఏదైన ముక్కుసూటిగా మాట్లాడంతో.. పలు వివాదాలు ఈయన కెరీర్ పై ప్రభావం చూపాయి. గతంలో ఓ విషయంలో కేసులో ఇరుకుని సినీ పరిశ్రమలో అవకాశాలు కోల్పోయారు. స్టార్ గుర్తింపు ఓర్చుకోలేని పలువురు హీరోలు కావాలనే ఈ విధంగా కేసులో ఇరుక్కునేలా చేశారని సుమన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇదంతా పక్కన పెడితే..

రీసెంట్‌గా ఈ నటుడు ఓ ఇంటర్వ్యూకు హాజరై.. కోలీవుడ్ హీరోలైన కమల్ హాసన్‌ రజనీకాంత్ పై సంచలన కామెంట్స్ చేశారు. రజనీకాంత్, కమల్ హాసన్ కు ముందు శివాజీ గణేశన్, ఎంజీఆర్ కోలీవుడ్‌లో పెద్ద స్టార్స్ అని వెల్లడించారు. శివ గణేశన్ మంచి యాక్టర్ అని కొనియాడారు. తర్వాత రజనీకాంత్ విలన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడని తెలిపారు. కమల్ హాసన్ కథానాయకుడిగా చేశాడని చెప్పారు. ఈయన కాలేజీ విద్యార్థులను ఫాలో అయ్యేవారన్నారు. ఇక రజనీకాంత్ స్పీడ్ వాకింగ్ తో ట్రెండ్ సెట్ చేశాడంటూ ఫన్నీ గా చెప్పుకొచ్చారు.

కమల్ మంచి రొమాంటిక్ హీరోనని, ఈయన డ్రెస్సింగ్ చాలా బాగుంటుందని, దీంతో యూత్ కమల్ హాసన్ ను బాగా ఫాలో అయ్యేవారంటూ చెప్పుకొచ్చారు. ఈ హీరో షూటింగ్ లో రొమాన్స్ చేస్తుంటే నేచురల్‌గా ఉండేదన్నారు. ఆయన డీ గ్లామర్ పాత్రల్లో కూడా చేశాడని పేర్కొన్నారు. కమల్ కన్న కుమార్తె శృతి హాసన్‌తో కూడా రొమాంటిక్ సన్నివేశాలు చేయగలడని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు


Similar News