పాన్‌ ఇండియా సినిమా ’కూర్మనాయకి‘ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో శివాజీ..!

హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Update: 2024-06-30 09:49 GMT

దిశ, సినిమా: హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని కారణాల రీత్యా సినిమాలకు దూరం అయిన శివాజీ బిగ్‌బాస్ షోతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే షో నుండి బయటకు వచ్చి వరుస ఆఫర్లు అందుకుంటూ మూవీలు చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే దర్శకుడు హర్షవర్ధన్ కడియాల భారీ సోషియో ఫాంటసీతో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'కూర్మ నాయకి'. ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్‌తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీ టీవీ గణేష్ కీ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ యాక్టర్ శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ రోజు శివాజీ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి వెల్కమ్ చేస్తూ స్పెషల్ వీడియోను కూర్మనాయకి టీమ్ రిలీజ్ చేసింది. శివాజీ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.

మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా 'కూర్మ నాయకి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హర్షవర్ధన్ కడియాల. అత్యున్నత సాంకేతిక విలువలతో పాటు హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఈ సినిమాకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. థర్డ్ షెడ్యూల్‌లో శివాజీ జాయిన్ అయ్యారు.

Full View

Similar News