Guppedantha Manasu ఆగస్ట్ 16 ఎపిసోడ్: వసుతో ప్రేమ గురించి మాట్లాడాలంటూ బయటికి తీసుకెళ్లిన రిషి

గుప్పెడంత మనస్సు ఈ రోజు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Update: 2023-08-16 08:43 GMT

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనస్సు ఈ రోజు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

రిషి కలుద్దాం అనేసరికి వసుకి కోటి ఆశలు పొంగుకొస్తాయి. వసు బయటికి వచ్చి..కాలేజ్ దగ్గర రిషి.. కిందకు దిగి కారు డోర్ తీసి నిలబడతాడు వసుని ఎక్కమని చెబుతాడు. వసు వెంటనే ఎక్కుతుంది. రిషి కారు స్టార్ట్ చేసి పోనిస్తాడు.. ఏం మాట్లాడాలి సార్ అని అడుగుతుంది.. అప్పుడు రిషి ఏమి మాట్లాడడు.. ‘ప్రేమా..’ అని అనేసరికి..హ అవును రిషి కూడా ప్రేమా.. అని అంటాడు. ఆ మాటకి వసు పొంగిపోతుంది. హలో ‘మేడమ్ నేను మాట్లాడేది ఏంజెల్ ప్రేమ, పెళ్లి విషయం’ అని అంటాడు‘ఏంజెల్ మనసులో ఎవరో ఉన్నారని విశ్వనాధం గారు అనుకుంటున్నారు. అతను ఎవరో ? ఏంటో మీరే తెలుసుకోవాలని అంటాడు.అప్పుడు వసు ‘నాకు ఏంజెల్ ఫ్రెండ్ అయ్యి కొంత కాలమే కానీ మీకు తను చదువుకునేప్పటి నుంచి తెలుసు కదా.. అని వసు అంటుంది. ‘మేడమ్ నాకు వేరే అమ్మాయిలతో ప్రేమ గురించి మాట్లాడలేను.. అందుకే మిమ్మల్ని అడుగుతున్నానని రిషి అంటాడు.. దాంతో వసు నవ్వుతూ.. ‘అవునా సార్.. మన అనుకునే మనుషులతో అంటే.. నన్ను మీరు వేరే అనుకోవట్లేదు కదా?’ అంటూ కావాలనే దగ్గర చేసుకునేలా మాట్లాడుతుంది.

Read More:   బ్రహ్మముడి ఆగస్ట్ 16 ఎపిసోడ్: ఇంత అందమైన పెళ్లాన్ని పెట్టుకొని ఇంత వరకు ఒక ముద్దు లేదు ముచ్చట లేదని తిడుతున్న ...

Tags:    

Similar News