Devara Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే ఆ ఈవెంట్ ను ఓ లెవెల్‌లో నిర్వహించాలని ప్లాన్?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Update: 2024-09-24 08:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా దేవర. దేశవ్యాప్తంగా ఈ మూవీ సెప్టెంబర్ 27 న థియేటర్స్ లో విడుదల కానుంది. దేవర మూవీ మన ముందుకు రావడం కొంచెం లేట్ అవుందేమో కానీ ప్రతీ యొక్క ఎన్టీఆర్ ఫ్యాన్ కాలర్ ఎగరేసేలా ఉంటుందంటూ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్‌ను అభిమానులు ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. రిలీజ్ కు ముందే మూవీ పోస్టర్, టీజర్ ఓ ఊపు ఊపేసాయి.

రెండు రోజుల క్రిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం ప్లాన్ చేస్తే కంట్రోల్‌ చేయలేనంత జనం రావడంతో ఈవెంట్‌ను వెంటనే క్యాన్సిల్‌ చేశారు. దీంతో ఫ్యాన్స్ అందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. వారి కోసం దేవర టీం మూవీ విడుదలైన తర్వాత సక్సెస్ మీట్ ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. ఏపీలో ఈ సక్సెస్ మీట్ పెట్టాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.

సక్సెస్ మీట్ ఓపెన్ ఏరియాలో పెట్టి ఈ సారి ఎలాంటి సమస్యలు రాకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ వలన ఇలా ఈవెంట్ క్యాన్సిల్ అవ్వటం ఇది రెండోసారి. గతంలో ఆంధ్రావాలా మూవీకి కూడా ఇలాగే జరిగింది. ఏపీలో జరగబోయే ఈ మీట్‌కు ఫేమ్ ఉన్న గెస్ట్ లను  తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిన సమాచారం. 


Similar News