మెగా ప్రిన్సెస్ క్లిన్ కారాకు గ్లోబల్ స్టార్ స్పెషల్ గిఫ్ట్.. వావ్ సూపర్ అంటున్న నెటిజన్లు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన 11 ఏళ్ల తర్వాత 2023లో ఓ బిడ్డకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే.
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన 11 ఏళ్ల తర్వాత 2023లో ఓ బిడ్డకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. జూన్ 20న వారికి ఆడపిల్ల పుట్టడంతో ఆ పాపకు క్లిన్ కారా అని నామకరణం చేశారు. ఒక అప్పటి నుంచి ఆ పాప ఫేస్ రివీల్ చేయనప్పటికీ మెగా ప్రిన్సెస్ ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే క్లిన్ కారా పాపను చూడాలని ఫ్యాన్స్ ఏకంగా ఏడాది నుంచి నెట్టింట రచ్చ చేస్తున్నప్పటికీ చూపించడం లేదు. కానీ ఆ పాప గురించి మెగా ఫ్యామిలీ వాళ్ళు చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, తన కూతురు క్లిన్ కారాకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్లు ఓ ఈవెంట్లో పాల్గొన్న చరణ్ స్వయంగా చెప్పడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అసలు విషయంలోకి వెళితే.. మగధీర సినిమా సమయంలో నేను స్వారీ చేసిన గుర్రాన్ని రాజమౌళిని అడిగి తెచ్చుకుని నా ఫామ్ హౌస్‌లో పెంచుకుంటున్నా. నేను ఎక్కిన గుర్రం పేరు బాద్షా అని పెట్టుకున్నాను. ఈ మధ్యే అది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దాన్ని క్లిన్ కారాకు గిఫ్ట్‌గా ఇచ్చాను. నా కూతురు దాంతో అప్పుడే ఆడుకోవడం మొదలెట్టింది. అంతేకాకుండా స్వారి చేయడానికి కూడా ప్రయత్నిస్తోంది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ రామ్ చరణ్ కామెంట్స్ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ వావ్ సూపర్ అంటున్నారు. కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, RC 16 సినిమాలు చేస్తున్నాడు.