మీ అభిమానిగా గర్వపడుతున్నా అంటూ.. చిరుకు బర్త్ డే విషెస్ తెలిపిన గెటప్ శ్రీను
జబర్దస్త్ గెటప్ శ్రీను మనందరికీ సుపరిచితమే
దిశ,వెబ్ డెస్క్: జబర్దస్త్ గెటప్ శ్రీను మనందరికీ సుపరిచితమే. చిరు అంటే తనకు చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూలో చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలో చిరంజీవి చేసే సినిమాల్లో చిన్న పాత్రలో అయినా కనిపిసున్నారు. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానాన్ని మాటలు రూపంలో రాసి చాటుకున్నాడు. మీ ప్రస్థానం .. మీ ప్రయాణం ఎన్నో రంగాలకి స్ఫూర్తిదాయకం..నేటి చిరంజీవికై .. నాడు కష్టజీవి శ్రమ ,మాకు ఆదర్శం ..మీ స్థాయిని మరచి ఏ స్థాయిలో వున్నవారి కైనా.. పై స్థాయికై మీరిచ్చే చేయూత వర్ణనాతీతం .. మీ అభిమానిగా గర్వపడుతూ .. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.