పబ్లిక్‌లో సుమ పరువు తీసిన మెగాస్టార్ చిరంజీవి.. అవి కొట్టేసిందంటూ?
బుల్లితెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన యాంకర్ సుమ గురించి సుపరిచితమే.
దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన యాంకర్ సుమ గురించి సుపరిచితమే. మలయాళీ భామైనా తెలుగులో సరళంగా మాట్లాడుతూ.. తన కామెడీతో, పంచులతో తెలుగు ప్రేక్షకులందరినీ కట్టిపడేస్తుంది. అగ్ర హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లకైతే సుమ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే తాజాగా సోషల్ మీడియా స్టార్స్ ను అభినందిస్తూ.. హైదరాబాదులో ఒక ఈవెంట్ నిర్వహించారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ వంటి పలువురు స్టార్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించింది.
ఈ క్రమంలో చిరు.. సమ మధ్య ఫన్నీ సంభాషణ జరుగుతుంది. చిరంజీవి.. భార్య సురేఖకు ఫోన్ చేస్తారు. కాల్ లో మాట్లాడుతూ.. సడన్ గా నా గ్రే కలర్ కోట్, బ్లాక్ ప్యాంట్ పోయిందని బాధపడ్డావ్ కదా? అది ఇప్పుడే దొరికింది. సుమ మన ఇంటికి ఎప్పుడొచ్చిందో తెలియట్లేదు కానీ.. డ్రెస్ మాత్రం దొరికింది. వచ్చేటప్పుడు తీసుకొస్తాను. కంగారు పడకు. సుమ నా కోటు నాకు ఇచ్చేయ్. నేను వేసుకోవాలి. ఇది నా కష్టార్జితంతో కొన్న డ్రెస్. చాలా కాస్ట్లీ. ఇలా దొంగతనం చేయడం కరెక్ట్ కాదు’’. అంటూ మెగాస్టార్ ఫన్నీగా మాట్లాడుతారు. దీంతో సుమ తెల్లమొహం వేసుకుని సరే సార్ అంటూ పక్కకు వెళ్లిపోతుంది.