BIG BOSS SEASON-8 ఇకపై బిగ్‌బాస్ హౌస్‌లో జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి..

ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసిన తెలుగు బిగ్‌బాస్ ఏడు సీజన్లు రసవత్తంగా సాగాయి.

Update: 2024-07-22 11:14 GMT

దిశ, సినిమా: ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసిన తెలుగు బిగ్‌బాస్ ఏడు సీజన్లు రసవత్తంగా సాగాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ సీజన్-8 లోగో విడుదల చేయనే చేశారు. లోగోతో పాటు జులై 21 న ప్రారంభమవ్వనుందని నాగార్జున అధికారింగా సోషల్ మీడియా వేదికన ప్రోమో కూడా రిలీజ్ చేశారు.ఈ ప్రోమోలో నాగార్జున.. ‘మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు మళ్లీ మీ ముందుకు వచ్చాము. బిగ్ బాస్ సీజన్-8 లో ఫుల్ ఫన్ ఉంటుంది. ప్రస్తుతం లోగో ప్రజెంట్ చేస్తున్నామంటూ’ నటసామ్రాట్ చెప్పుకొచ్చారు.

అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి బిగ్‌బాస్ హౌస్ గురించి సంచలన నిజాలు బయటపెట్టారు. హౌస్ లో మనకు తెలియని సీక్రెట్స్ ఉంటాయన్నాడు. ప్రతి చోట మైక్స్, సీసీ కెమెరాలు ఉంటాయట. చివరకు బాత్రూంలో కూడా సీక్రెట్ మైక్స్ ఉంటాయట. కాగా బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటూ, ప్రతి మూమెంట్‌ను గమనిస్తూనే ఉంటారంటూ ఆదిరెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట సెన్సేషనల్ గా మారాయి


Similar News