ముందుగా ఆ మూవీలో త్రిషకు బదులు సాయి పల్లవిని సెలెక్ట్ చేశారంట..

అజిత్ హీరోగా సంక్రాతి కానుకగా విడుదలైన ‘తెగింపు’ సినిమా వంద కోట్లకుపైగా క‌లెక్షన్స్ రాబ‌ట్టింది.

Update: 2023-03-13 13:05 GMT

దిశ, సినిమా: అజిత్ హీరోగా సంక్రాతి కానుకగా విడుదలైన ‘తెగింపు’ సినిమా వంద కోట్లకుపైగా క‌లెక్షన్స్ రాబ‌ట్టింది. బ్యాంకు స్కామ్‌ల‌కు యాక్షన్ అంశాల‌ను జోడించి ద‌ర్శకుడు హెచ్ వినోద్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. అయితే ఈ చిత్రంలో మంజూ వారియర్ చేసిన క్యారెక్టర్ కోసం ముందుగా సాయి పల్లవిని సంప్రదించారట. కానీ ఆ పాత్రకు అంత వెయిటేజీ లేదని తిరస్కరించింది.

ఇక విజయ్ దళపతి ‘లియో’లో భార్యగా ప్రస్తుతం త్రిష నటిస్తోంది. ఈ పాత్ర కోసం కూడా ముందుగా సాయి పల్లవిని సంప్రదించినా.. నో చెప్పేసిందట. ఆ క్యారెక్టర్‌కు తగినంత వ్యవధి, వెయిటేజీ లేని కారణంగా ఆ నిర్ణయం తీసుకుందని సమాచారం. కాగా దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. ‘కథ, పాత్రకు సమానమైన ప్రాధాన్యతనిచ్చే పాత్రలను అంగీకరించాలని సాయి పల్లవి మొదటి నుంచి నమ్ముతుంది. అదే ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టింది’ అంటున్నారు.

Tags:    

Similar News