Naga Chaitanya : నాగచైతన్య ఇన్‌స్టాలో సమంత ఫోటో.. డిలీట్ చేయాలంటూ ఫ్యాన్స్ ఫైర్!

నాగచైతన్య జీవితంలో సమంత చాప్టర్ క్లోజ్ అయినట్లే. ప్రేమించి ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట తమ వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్ కాలేక విడిపోయిన విషయం తెలిసిందే. ఇక సమంత, నాగచైతన్య

Update: 2024-08-08 16:37 GMT

దిశ, సినిమా :నాగచైతన్య జీవితంలో సమంత చాప్టర్ క్లోజ్ అయినట్లే. ప్రేమించి ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట తమ వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్ కాలేక విడిపోయిన విషయం తెలిసిందే. ఇక సమంత, నాగచైతన్య ఎవరి లైఫ్‌లో వారు చాలా బిజీ అయిపోయారు. ఇక ఎవరూ చైతూ రెండో పెళ్లి చేసుకుంటారు అని ఊహించలేదు. ఒక్కసారిగా తన అభిమానులకు షాకిస్తూ.. నాగచైతన్య శోభిత దూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ నిశ్చితార్థం వేళ చాలా మంది నాగచైతన్య ఇన్ స్టానే టార్గెట్ చేశారు. సమంత ఫోటోస్ డిలీట్ చేశాడా లేదా చూడగా, అందులో చై, సమంత పిక్స్ అన్నీ డిలీట్ చేశాడు. అయితే ఒక ఫోటోను మాత్రం ఆయన డిలీట్ చేయలేదు.

మజిలీ మూవీలోని ఓ పోస్టర్‌లో సామ్ వెనుక భాగం కనిపిస్తుండగా, చై హెల్మెట్ పెట్టుకొని, రెడ్ కలర్ కారు వద్ద ఉంటారు. ఇందులో సమంత ఉంటుంది. దీంతో సామ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని డిలీట్ చేసినప్పుడు ఆ ఫోటో మాత్రం ఎందుకు డిలీట్ చేయలేదు. అది కూడా డిలీట్ చేయాలి. నీకు సమంత ఫోటో పెట్టుకునే అదృష్టం లేదు అంటూ ఫైర్ అవుతున్నారు.

Tags:    

Similar News