నటి రష్మిక మందన్న ఫేక్ వీడియో.. 3 ఏళ్ల జైలు శిక్ష, 1 లక్ష జరిమానా
నటి రష్మిక మందన్నకు చెందిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.
దిశ, వెబ్‌డెస్క్: నటి రష్మిక మందన్నకు చెందిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. హీరోయిన్ రష్మిక కు చెందిన డీప్‌ఫేక్ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఒక సలహాను జారీ చేసింది. అటువంటి డీప్‌ఫేక్‌లను కవర్ చేస్తే చట్టపరమైన నిబంధనలను అమలు చేస్తామని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఈ వీడియోను తయారు చేసినట్లు గుర్తించారు.
డీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు రూల్ రిమైండర్‌ను పంపింది. ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 లోని సెక్షన్ 66D ప్రకారం.. 'కంప్యూటర్ వనరులను ఉపయోగించి.. ఎవరినైనా కించ పరిచే విధంగా చేస్తే.. మూడు సంవత్సరాల జైలు శిక్ష, ఒక లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుందని స్పష్టం చేశారు. కాగా ఆ వీడియో తనదే అని ఓ మహిళా ఒప్పుకుంది. కానీ తన వీడియోను ఎవరు అలా చేశారో తనకు తెలియదని చెప్పుకొచ్చింది.