Relationship: ఆకర్షణ మొదలు అర్థం చేసుకునేదాకా... రిలేషన్‌షిప్స్ దశలేవో తెలుసా?

ఆకర్షణల జడిలో తడిసి అర్థం చేసుకునే దాకా ఎదిగే రెండు హృదయాల కలయిక గ్రేట్ రిలేషన్ షిప్ వైపు దారితీస్తుందంటారు.

Update: 2023-04-03 04:47 GMT

దిశ, ఫీచర్స్: చూపులూ చూపులు కలిసి, ఆకర్షణల జడిలో తడిసి అర్థం చేసుకునే దాకా ఎదిగే రెండు హృదయాల కలయిక గ్రేట్ రిలేషన్ షిప్ వైపు దారితీస్తుందంటారు నిపుణులు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుకొని ఒక్కటై స్థిరపడేవరకు ఇందులో ఆనందాలు, ఆలోచనలు, భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. స్వచ్ఛమైన రిలేషన్ షిప్‌లో ఇరువైపులా చాలా ప్రయత్నాలు జరుగుతాయి. ఇద్దరు వ్యక్తులు పర్సనల్‌గా కలిసిపోవడానికి, జీవితంలో ఎదగడానికి సురక్షితమైన, సంతోషకరమైన పరిస్థితులను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక చక్కటి బంధం ఏర్పడటానికి వ్యామోహం నుంచి అంగీకారం వరకు 1. వ్యామోహం(Infatuation), 2. రియలైజేషన్, 3. టెన్షన్, 4. అంగీకారం(Acceptance) అనే నాలుగు దశలు ఉంటాయని ముంబైకి చెందిన థెరపిస్టు నివేదిత చెప్తున్నారు.

వ్యామోహం

ఇది ప్రారంభ దశ.. తరచూ మెదడు డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి లవ్ హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మనలో హాప్పీనెస్, సేఫ్టీ, ఎమోషనల్ టచ్ వంటి ఫీలింగ్స్ కలుగుతాయి. మెదడు హేతుబద్ధమైన ఆలోచనలకంటే ఆవేశం, భావోద్వేగాలవైపే మొగ్గుతుంది. ఒక పట్టాన ఎవరూ చెప్పింది పట్టించుకోకుండా మనకు నచ్చిందే చేస్తుంటాం.

రియలైజేషన్

ఈ దశలో లవ్ హార్మోన్లు క్షీణించడం ప్రారంభిస్తాయి. వ్యక్తిలో వాస్తవాలు తెలుసుకునే ఆలోచన పెరుగుతుంది. గత ఆలోచనలు కొన్ని ఈ దశలో ఉన్నప్పుడు కరెక్ట్ కావు అని కూడా అనిపంచవచ్చు. లేదా వింతగా మనం అలా ప్రవర్తించామా? అనే సందేహం, ఆశ్చర్యం కూడా కలుగువచ్చు. రిలేషన్ షిప్‌లో భ్రమలకు స్వస్తి పలికి సత్యాలను గ్రహించడం ప్రారంభిస్తారు.

టెన్షన్

రిలేషన్ షిప్ నాలుగు దశలలో ఇది ఉద్రిక్తతతో కూడి ఉంటుంది. ఇద్దరి మధ్య విభేదాలు రావడం, పరిష్కరించబడటం జరుగుతూ ఉంటాయి. జంటలు చాలా కాలం పాటు టెన్షన్ దశలో ఉంటారు. రిలేషన్ షిప్‌ను కొనసాగించడం, లేదా విడిపోవడం అనేది ఈ దశలోనే జరుగుతుంటాయి.

అంగీకారం (Acceptance)

ఈ దశలో వ్యక్తులు రిలేషన్‌షిప్ ఫాంటసీ థాట్స్ నుంచి బయటపడతారు. విభేదాలను పరిష్కరించుకోవడం, అర్థం చేసుకోవడం, అడ్జస్ట్ అవ్వడం ప్రారంభిస్తారు. కలిసి జీవించేందుకు ఇరువైపులా ప్రయత్నాలు కొనసాగిస్తారు.

ఇవి కూడా చదవండి: ఫైనల్‌గా పెళ్లి పీటలు ఎక్కనున్న సింగర్ దేవిశ్రీ..! పెళ్లి కూతురు ఎవరో తెలుసా..?

Tags:    

Similar News