వేణు స్వామి చెప్పేదంతా భూటకం.. నాగచైతన్య- సమంత విడాకుల విషయంలోని అసలు నిజాలు చెప్పిన కమెడియన్!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అందరికీ సుపరిచితమే. ఆయన సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులపై పలు కామెంట్స్ చేస్తూ సెన్సేషన్‌గా మారాడు.
దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అందరికీ సుపరిచితమే. ఆయన సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులపై పలు కామెంట్స్ చేస్తూ సెన్సేషన్‌గా మారాడు. ముఖ్యంగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని పెళ్లికి ముందే చెప్పి అందరినీ షాక్‌కు గురి చేశాడు. అన్నట్లుగానే పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో జనాలు వేణు స్వామి మాటలు నమ్మడం మొదలెట్టారు. అలాగే కొంత మంది హీరోయిన్స్ ఆయనతో పూజలు కూడా చేయించుకున్నారు. అలాగే వేణు స్వామి ఏపీ ఎన్నికల ఫలితాల్లో సీఎం అయ్యేది ఎవరో చెప్పి పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఈ క్రమంలో.. తాజాగా, జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ, వేణు స్వామి చెప్పేవన్నీ అబద్ధాలు అని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘ ఉదయం లేవగానే సెలబ్రిటీలు వెళ్లే పబ్‌కు వేణు స్వామి వెళతాడు. ఐదో, ఆరో పెగ్‌ల తర్వాత కొందరు ఫోన్లు మాట్లాడుతుంటారు. ఇవన్నీ వేణు స్వామి చాటుగా వింటాడు. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారని ఎవరో, ఎక్కడో మాట్లాడుకుంటుంటే విని వేణు స్వామి అందరికీ చెప్పాడు. అసలు జంట మధ్య విభేదాలు వస్తే ఉదయానికి విడాకులు తీసుకోరు. కొన్ని నెలల పాటు వారి మధ్య ఏవైనా గొడవలు జరుగుతూ ఉంటుంది. ఇక విసిగిపోయిన వారు పెద్దలకు చెప్పడంతో వారు బాధను అర్థం చేసుకొని తప్పని పరిస్థితుల్లో విడిపోమని చెప్తారు.
ఆ నాలుగు నెలల సంఘర్షణ ముందే వాడు ఎవరో ఒకరు మాట్లాడుకుంటుంటే తెలుసుకొని.. అప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి మెడలో జంజం వేసి, నుదుటిన బొట్టు పెట్టి సమంత నాగచైతన్య విడిపోతారంటూ కామెంట్లు చేశాడు. కొంతమంది వీడి మాటలు నమ్ముతున్నారు. కానీ నిజానికి వాడికి జాతకాలు తెలియదు. అంతా భూటకం’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కిరాక్ ఆర్పీ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన వారంతా వేణు స్వామిపై మండిపడుతున్నారు.