ఫేక్ వీడియోల కారణంగా భయపడే ప్రతి ఒక్కరూ ఈ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ చూడాల్సిందే
ప్రస్తుతం థియేటర్ సినిమాల కన్నా, ఓటీటీ సినిమాలు చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భా
దిశ, సినిమా: ప్రస్తుతం థియేటర్ సినిమాల కన్నా, ఓటీటీ సినిమాలు చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు అయితే తప్ప ఎవరూ వెళ్లి చూడటం లేదు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్స్ , మూవీ మేకర్స్ చాలా కష్ట పడాల్సి వస్తుంది. ఎందుకంటే సినిమా తీయడం ఒక ఎత్తైతే, ఆ మూవీని ప్రమోట్ చేయడం వారికి పెద్ద భారంగా ఉంది. కొంతమంది ఇంత రిస్క్ పడలేక థియేటర్ కి వచ్చిన వారంలోనే ఓటీటీ సంస్థలతో డీల్ చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి సినిమానే ఓటీటీలో సందడి చేస్తుంది.
ప్రేమలో అనే మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదలై ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. ఈ సినిమా మొత్తం రాజమండ్రి బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా నేరుగా జూలై 12 న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఇప్పుడు అందరూ ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. సమాజంలో జరిగే కామన్ పాయింట్ తీసుకుని తెరకెక్కించారు. ఈ మూవీలో శివాజీరాజా, మధుసూదన్‌రావు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇక సినిమా కథలోకి వెళ్తే.. నిజ జీవితంలో జరిగే సంఘటనలను దర్శకుడు చందు కొండేరి అద్భుతంగ చూపించాడు. ఫేక్ వీడియోల వలన చాలా మంది భయపడి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేస్తారు. ఈ మూవీ అదే పాయింట్ మీద తిరుగుతూ ఉంటుంది. హీరో రవి, ప్రశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే, ఆమెకు మాటలు రావు.. ప్రేమించుకోవడానికి మనసులు కలిస్తే చాలు మాటలతో అవసరమా అన్నట్టు కథ సాగుతూ ఉంటుంది. అయితే, ఆమెతో రవి కలిసి ఉన్న ఓ వీడియో ఒకటి లీక్ అవుతుంది. ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏమి చేయాలో తెలియక ప్రశాంతి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలనుకుంటుంది. ఆ వీడియో ఎవరు ఎందుకు లీక్ చేసారు? దాని వెనకున్న వాస్తవం ఏంటి? రవి నిర్దోషి అని ఎలా నిరూపించుకున్నాడో తెలియాలంటే ఈ థ్రిల్లర్ చూడాల్సిందే.
#premalo OTT RELEASE NOW @PrimeVideoIN pic.twitter.com/zmrnSe3tlH
— OTTGURU2 (@ottguru2) July 12, 2024