సమంతకు శిక్ష పడేలా చేయాలంటూ డాక్టర్ ఫైర్.. కారణం ఏంటంటే?
సమంత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తోంది.
దిశ, సినిమా: సమంత నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తోంది. అయితే కొంతమంది ఆమె చెప్పే ఆరోగ్య విషయాలను పాటిస్తే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇటీవల ఓ నెటిజన్ డైరెక్ట్‌గా సమంతనే తప్పు చేశావని అన్న విషయం తెలిసిందే. దానికి సామ్ అవును తెలియక తప్పు చేశాను. కానీ నేను చేసిందే నమ్ముతానని చెప్పింది. అయితే సమంత ఇటీవల సామ్ నెబ్యులైజర్ పెట్టుకుని ఓ పోస్ట్ పెట్టింది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మందులు వాడకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజర్ ద్వారా పీల్చండి అని రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. దీనిపై ఓ డాక్టర్ స్పందించి ఆమెపై ఫైర్ అయ్యాడు.
‘‘భారతీయ స్టార్ నటి సమంత దురదృష్టవశాత్తూ ఆరోగ్యం, సైన్స్ తెలియని నిరక్షరాస్యురాలు. ఆమె మిలియన్ల మంది ఫాలోవర్లకు శ్వాసకోశ, వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి హైడ్రోజన్-పెరాక్సైడ్‌ను పీల్చమని సలహా ఇస్తుంది. సైంటిఫిక్ సొసైటీ, ది ఆస్త్మా అండ్ అలర్జీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆరోగ్యానికి ప్రమాదకరమని నెబ్యులైజ్ చేయవద్దని (పీల్చవద్దని) ప్రజలను హెచ్చరించింది. హేతుబద్ధమైన, శాస్త్రీయంగా ప్రగతిశీల సమాజంలో, ఈ మహిళ ప్రజారోగ్యానికి హాని కలిగించినందుకు జరిమానా లేదా కటకటాల వెనుక ఉంచి శిక్ష అనుభవించేలా చేయాలి. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఈ సోషల్ మీడియా హెల్త్ ఇన్ ఫ్లుయెన్సర్స్ గురించి భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేదా ఏదైనా ఆరోగ్య నియంత్రణ సంస్థ ఏదైనా చర్య తీసుకుంటుందా..? లేదా బాధ్యత లేకుండా ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తారా..? అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. అంతేకాకుండా సమంత నెబ్యులైజర్ పెట్టుకున్న ఫొటోను షేర్ చేశాడు.