ఇంట్లో సమంత ఒంటరిగా ఏం చేస్తుందో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న ఈ బ్యూటీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ఎప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈమె రెండో పెళ్లి, లవ్

Update: 2024-05-20 09:46 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న ఈ బ్యూటీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ఎప్పటికీ వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈమె రెండో పెళ్లి, లవ్ ఎఫైర్ అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తాయి. అయితే ఈ బ్యూటీ డివోర్స్ తీసుకొని రెండు సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటికీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది.

అయితే తాజాగా సమంత తాను తన పర్సనల్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నాగచైతన్య, సమంత కలిసి ఉన్నప్పుడు నిర్మించుకున్న ఇల్లును సమంత ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేసి ఆ ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. సామ్ ఇంట్లోనే ఒంటరిగా తన పెట్ డాగ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఆమె తాజాగా తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పటి ఫొటోలు షేర్ చేస్తూ.. తన పెట్ డాగ్స్ ఇవి ఎప్పటికీ నన్ను అంటి పెట్టుకుని ఉండే నా డార్లింగ్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సమంత చేతిలో ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువగా లేవు. ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా మా ఇంటి బంగారం అనే టైటిల్‌తో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ మూవీని ఆమె నిర్మించబోతన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.


Similar News