పవన్ అన్నప్రాశనలో ఏం పట్టుకున్నాడో తెలుసా..? అసలు పేరు ఇదే!.. ఆకట్టుకుంటున్న తల్లి అంజనాదేవి ఇంటర్వ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

Update: 2024-10-04 03:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల్లో స్టార్‌డమ్ తెచ్చుకున్న పవన్.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఫుల్ బిజీగా మారారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన ప్రజలకు సేవ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అమ్మ అంజనా దేవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం..

తిరుమలలో యోగ నరసింహస్వామి గుడి ఉంది కదా.. పవన్ కళ్యాణ్ గారి అన్నప్రాసన అక్కడే జరిగిందని విన్నాము. అందుకు సంబంధించిన వివరాలు చెబుతారా అని యాంకర్ అడుగగా.. దానికి అంజనా దేవి స్పందిస్తూ.. ‘మేము ఒకసారి తిరుపతి దర్శనానికి వెళ్లాము. అప్పటికి కచ్చితంగా మా అబ్బాయికి ఆరో నెల వచ్చింది. ఆరో నెల వచ్చింది కదా ఇక్కడే అన్నప్రాసన చేసేద్దామని నాకు మనసులో అనిపించింది. శ్రీ వెంకట్రావు గారు పోలీసు అవడం వల్ల ఆ రోజుల్లో ఆయన దగ్గర ఎప్పుడూ చిన్నపాటి కత్తి ఉండేది. ఆ కత్తి, పెన్ను, పుస్తకాలు, దేవుడి ప్రసాదం పెట్టి యోగ నరసింహ స్వామి వద్ద పడుకోబెట్టి చేసేద్దామండి అన్నాను. అంతకంటే అదృష్టం ఏముందని ఆయన అన్నారు. అన్నప్రాసన చేస్తే పవన్ ముందు కత్తి పట్టుకున్నాడు. తర్వాత పెన్ను పట్టుకున్నాడు. అయితే కత్తి పట్టుకున్నాడు కదా పిల్లాడు కోపిష్టి అవుతాడు లేదంటే పది మందికి ఏదో చేస్తాడు అని అప్పుడే అనుకున్నాను’ అని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మీరు చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణేనా? అని యాంకర్ అడుగగా.. దానికి సమాధానం ఇస్తూ.. కాదు. శ్రీ కళ్యాణ్ కుమార్ అని పెట్టాం. అది వెంకటేశ్వర స్వామి పేరు అంటూ తల్లి అంజనా దేవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Full View

(video link credits to ABP Desam youtube channel)


Similar News