దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ రాజ్ తరుణ్ నుంచి మొదలయి యూట్యూబర్ హర్ష సాయి వరకు వెళ్ళింది. హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడంటూ రూ.2 కోట్లు తీసుకుని వాడుకున్నాడని సినీ నటి హర్షసాయిపై ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, తాగే డ్రింక్స్ లో మత్తు కలిపి ఆమెపై లైంగిక దాడి చేసాడంటూ కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన దగ్గర నుంచి హర్ష సాయి జాడే లేదు.
అయితే, ఆమె హర్ష సాయిపై మరో ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనని కావాలని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారని ఆరోపించింది. ఇలా ట్రోలింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితురాలు వాటికీ సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను పోలీసులకు ఇవ్వడంతో కేసు నమోదు చేసారు. అయితే, హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో తలదాచుకున్నాడని తెలిసిన సమాచారం.
సోషల్ మీడియాలో హర్ష సాయి ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్‌లో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోట్ చేస్తూ ఆ డబ్బుతోనే ప్రజలకు సాయం చేస్తున్నాడంటూ ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.