సితారను ఇంతలా హైలెట్ చేయడం వెనుక మహేష్, నమ్రత ప్లాన్ ఏంటో తెలుసా..?
ఘట్టమనేని వారసురాలు సితార పాప గురించి పరిచయం అవసరం లేదు.
దిశ, సినిమా: ఘట్టమనేని వారసురాలు సితార పాప గురించి పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సితు పాప.. ఇప్పుడు పట్టుమని 15 ఏళ్లు కూడా లేకపోయినా ఇండస్ట్రీలో హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్న ఆమె.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వేడుకలకు కూడా హాజరవుతుంది.
దీంతో ఇలా ఉన్న ఫలంగా మహేష్ బాబు, నమ్రత తమ కుమార్తెను అంతగా హైలెట్ చేయడానికి కారణం ఏంటి? దీని వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గతంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా మహేష్ బాబు విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. మహేష్‌ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసే ముందు ఈ విధంగానే హైలెట్ చేశాడు. అనంతరం ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. కాగా సితార విషయంలో కూడా మహేష్ ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడనే టాక్ వినపడుతుంది.