ఆ యాడ్‌లో నటించినందుకు రాజమౌళి ఎంత తీసుకున్నాడో తెలుసా?

ఈ మధ్య కాలంలో కొంచెం పేరున్న హీరో, హీరోయిన్‌లు లెక్కకు మించిన రెమ్యునరేషన్‌లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2023-06-29 09:55 GMT

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో కొంచెం పేరున్న హీరో, హీరోయిన్‌లు లెక్కకు మించిన రెమ్యునరేషన్‌లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అన్ని దేశాల్లో తన పేరు మారుమ్రోగుతూనే ఉంది. రాజమౌళి రీసెంట్‌గా ఓ మొబైల్ యాడ్‌లో నటించగా.. దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు మొదటిసారి చేసిన యాడ్ కోసం రాజమౌళి ఎంత పారితోషికం తీసుకున్నారో అనేది హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా జక్కన తన రేంజ్‌ను బట్టి ఒక్కో సినిమాకు రూ.150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. అలా ఈ యాడ్ కోసం రాజమౌళి ఏకంగా మూడు కోట్ల అందుకున్నట్లు తెలుస్తోంది. కానీ, తన రేంజ్‌కు ఇది చాలా తక్కువ అని టాక్. ఎందుకంటే హీరోలు చిన్న యాడ్‌ చేస్తే 10 నుంచి 15 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న రాజమౌళి మూడు కోట్లు మాత్రమే అంటే చాలా తక్కువేననంటున్నారు ఆయన ఫ్యాన్స్.

Read More:   మా సినిమా నాకే నచ్చలేదు.. ఆదిపురుష్‌పై నటుడు షాకింగ్ కామెంట్స్ 

Tags:    

Similar News