బేబీ సక్సెస్ మీట్లో మెగాస్టార్ పెట్టుకున్న వాచ్ ఎన్ని కోట్లో తెలుసా?
హీరో ఆనంద్ దేవరకొండ.. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బేబీ’ చిత్రం ఊహించని రేంజ్లో ఎంతలా హిట్ అయ్యిందో చెప్పుకోనవసరం లేదు.
దిశ, వెబ్‌డెస్క్: హీరో ఆనంద్ దేవరకొండ.. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బేబీ’ చిత్రం ఊహించని రేంజ్లో ఎంతలా హిట్ అయ్యిందో చెప్పుకోనవసరం లేదు. అయితే ఇటీవల ఈ సినిమా సక్సెస్ మీట్ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్లో హాజరై.. బేబీ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. అయితే కొంతమంది మెగాస్టార్ డ్రెస్సింగ్ స్టైల్‌పై ఫోకస్ పెట్టారు. ఈ హీరో ఈ కార్యక్రమంలో ఖరీదైన వాచ్ ధరించాడు. దీంతో అందరి దృష్టి ఆ వాచ్‌పై పడింది. ఇది ‘రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ది టైగర్’ అనే మోడల్‌కు చెందినదట.
కాగా దీని ప్రైస్ ఎంతని కొందరు గూగుల్‌లో సెర్చ్ చేయగా.. 230,000 డాలర్లు చూపిస్తుందట. అది ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ. అంటే అది మన ఇండియాలో రూ.1.89 కోట్లుగా ఉంటుంది. చిరు పెట్టుకున్న వాచ్ ధర దాదాపుగా రూ. 2 కోట్లు విలువ కలిగినదని సమాచారం. దీంతో మెగా ఫ్యాన్స్.. ‘మెగా స్టార్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే’ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది.
Read More : పవన్ కల్యాణ్ నాతో పిల్లల్ని కను.. వారిని రాజకీయాల్లోకి పంపిద్దాం: శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!
పవన్ కల్యాణ్ చేసిన తప్పుకు వారికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి.. అసలు ఏం జరిగిందంటే?