Siddu Jonnalagadda:కష్ట కాలంలో గొప్ప మనసు చాటుకున్న DJ టిల్లు హీరో

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి.

Update: 2024-09-03 08:16 GMT

దిశ,వెబ్‌డెస్క్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే చాలామంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరికొంత మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు అపన్నహస్తం అందిస్తున్నారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరద సహాయనిధికి తాజాగా యంగ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ రూ.15 లక్షల చొప్పున మొత్తం 30 లక్షల రూపాయలు అందించారు.

‘తెలుగు రాష్ట్రాలను ఇలా వరదలు ముంచెత్తడం చాలా బాధాకరమైన విషయం. ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇంకెవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది. ఈ వరదలు చాలా కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేశాయి. ఇలాంటి సమయాల్లో మనం ఒకరికి ఒకరు తోడుగా ఉండటం అత్యవసరం. వరద బాధితులకు నా వంతు సహకారంగా 30 లక్షల ఆర్థిక సహాయాన్ని (15 లక్షలు ఆంధ్రప్రదేశ్‌కి, 15 లక్షలు తెలంగాణకు) వరద సహాయనిధికి ప్రకటిస్తున్నాను. ఇది కొంత మందికి అయితే ఏదో ఒక విధంగా ఉపయోగపడుతోందని ఆశిస్తున్నాను’ అని హీరో సిద్దు జొన్నల గడ్డ పేర్కొన్నారు.


Similar News