అలా పిలవొద్దని వేడుకున్నా వినట్లేదు.. బాలీవుడ్ నటి
దిశ, సినిమా : బాలీవుడ్ నటి దిశా పటానీ తనను ‘పటానీ కాదు పట్నీ’ అని పిలవమంటోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’లో చాన్స్..latest telugu news
దిశ, సినిమా : బాలీవుడ్ నటి దిశా పటానీ తనను 'పటానీ కాదు పట్నీ' అని పిలవమంటోంది. ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే'లో చాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన కెరీర్ విశేషాలు వెల్లడించింది. ఎవరైనా తనను 'పటానీ అని పిలవడం అస్సలు ఇష్టముండదని.. 'దిశా పట్నీ' అనాలని మొత్తుకున్నా ఎవరు వినట్లేదని చెప్పింది. ఇక పైలట్ కావాలనుకున్నప్పటికీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పిన నటి.. సంపాదన కోసం కమర్షియల్ యాడ్స్‌లో కనిపించడం, క్రమంగా కెమెరా వైపు అట్రాక్ట్ కావడం వేగంగా జరిగిపోయినట్లు తెలిపింది. ఇక స్ట్రిక్ట్ డైట్ పాటించినప్పటికీ చికెన్, స్వీట్స్ చూస్తే ఆగలేనన్న దిశ.. ఆదివారం మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తానని చెప్పింది. సల్మాన్, జాకీచాన్‌లతో కలిసి పనిచేయడం వల్లే ఫిట్‌నెస్‌పై దృష్టి పెరిగిందని, శరీరాకృతిని కాపాడుకొనేందుకు వాళ్ల దగరి నుంచే టిప్స్ నేర్చుకున్నట్లు వివరించింది.